Header Banner

హజ్ యాత్రికులకు ఏపీ సర్కార్ అప్ డేట్.. తొలి విడత షెడ్యూల్ రెడీ! మంత్రి కీలక ప్రకటన!

  Wed Apr 16, 2025 20:31        Politics

ఏపీ నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి హజ్ యాత్రకు వెళ్లే వారి కోటాతో పాటు ఇతర ఏర్పాట్ల వివరాలను ఇవాళ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హజ్ -2025 యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుండి యాత్రికుల ప్రయాణాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏపీ నుంచి హజ్ యాత్ర ప్రయాణాలకు సంబంధించిన వివరాలను మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 1630 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో 1170 మంది యాత్రికులు హైదరాబాద్ ఎంబార్కేషన్ నుండి బయలుదేరుతున్నారని తెలిపారు. వివిధ దశల్లో హజ్ యాత్ర ప్రయాణ ప్రణాళిక ఖరారు అయిందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలోమొత్తం 236 మంది ఈనెల 29వ తేదీ నుండి మే 11 తేదీ వరకు హైదరాబాద్ నుండి మదీనా మునవ్వరా కు బయలుదేరుతారని పేర్కొన్నారు.

రెండవ విడతలో 934 మంది మే 19 వ తేదీ నుండి 27 తేదీ వరకు హైదరాబాద్ నుండి జెడ్డాకు బయలుదేరనున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. అలాగే బెంగళూరు ఎంబార్కేషన్ నుండి 452 మంది హజ్ యాత్రికులు ఈ నెల 30 తేదీ నుండి మే 15 వ తేదీ వరకు బెంగళూరు నుండి మదీనా మునవ్వరాకు బయలుదేరుతారని తెలిపారు. హైదరాబాద్ ఎంబార్కేషన్, బెంగళూరు ఎంబార్కేషన్ ల నుండి హజ్ యాత్ర కు బయలుదేరుతున్న ఏపీ హజ్ యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించే విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యాత్రికులు తమ ఆరోగ్య రీత్యా హజ్ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. హజ్ యాత్రకు బయలుదేరుతున్న వారందరికీ మైనారిటీ శాఖా మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Haj2025 #AndhraPradesh #HajPilgrims #APGovtUpdate #MinisterFarooq